E-Paper
Advertisement

Flexi Banner Controversy: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి.. తణుకు వై జంక్షన్ వద్ద హైటెన్షన్!

Flexi Banner Controversy: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి.. తణుకు వై జంక్షన్ వద్ద హైటెన్షన్!
Advertisement

Flexi Banner Controversy: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజకీయ సెగలు రేగాయి. పట్టణంలోని కీలక ప్రాంతమైన వై జంక్షన్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కాస్తా, అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అనుచరులు వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో శుభాకాంక్షల ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఈ వివాదానికి దారితీసింది.

ఈ పరిణామంపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీలు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేపట్టారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒకానొక దశలో మాజీ మంత్రి, పోలీసు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

నిరసన సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న తణుకు రూరల్ సీఐపై మాజీ మంత్రి కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. “ఖైదీ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకో.. ఇంత ఊడిగం చేస్తావా?” అంటూ ఆయన పోలీసు అధికారిపై విరుచుకుపడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధుల్లో ఉన్న బాధ్యతాయుతమైన అధికారిని ఉద్దేశించి అటువంటి పదజాలం వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. పదవిలో ఉన్నా లేకపోయినా పోలీసు యంత్రాంగం పట్ల గౌరవం ఉండాలని, చట్టాన్ని గౌరవించాల్సిన మాజీ మంత్రి ఇలా బహిరంగంగా దూషించడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన కారుమూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: చంద్రబాబు నిజంగానే జగన్‌ను ఫాలో అవుతున్నారా?

ప్రస్తుతం తణుకు వై జంక్షన్ వద్ద పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సెక్షన్ 30 అమలులో ఉందని, ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×