E-Paper
Advertisement

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం

Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం
Advertisement

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో లక్షల విలువ చేసే ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది. రాజా-చీపురుపల్లి రోడ్డులోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయల్ ఫ్యాక్టరీ ఉంది.

ఆదివారం రాత్రి పది గంటల సమయంలో అందులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధాన్యం నుంచి తవుడును ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది తేరుకునే లోపు ముడిసరుకు అగ్నికి ఆహుతయ్యింది.

Advertisement

కార్మాగారంలో సుమారు కోటి రూపాయల విలువైన పవువుల దాణా ఉంది. అందులో సగానికి పైగానే మంటల్లో కాలిపోయింది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలకు ఈదురుగాలులు తోడు కావడంతో మరింత ఎగిసిపడ్డాయి.

ALSO READ: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!

Advertisement

ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ అధికారులు. దాదాపు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అర్థరాత్రి వరకు మంటలు కొనసాగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దాణా నిల్వతోపాటు ఖాళీగా గోనె సంచలు ఉండడంతో నిప్పు రప్పులు రగిలి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

 

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×