E-Paper
Advertisement

ట్రావెల్స్ బస్సులో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు, విజయవాడలో ఘటన

ట్రావెల్స్ బస్సులో మంటలు.. బెంబేలెత్తిన ప్రయాణికులు, విజయవాడలో ఘటన
Advertisement

Vijayawada: విజయవాడలోని ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సేఫ్‌గా బయటపడ్డారు. అసలు ఘటనకు సంబంధించి కారణాలేంటి?

ట్రావెల్స్ బస్సులో మంటలు..  విజయవాడ‌లో ఘటన

Advertisement

ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లో బస్సుల ప్రమాదాలు జోరందుకున్నాయి. ఏపీ-తెలంగాణలో ఎక్కడో దగ్గర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం రాత్రి విజయవాడ బస్‌స్టేషన్ సమీపంలో ఓ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్‌గా బయటపడ్డారు.

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. విజయవాడలోని బ్యాటరీ టెర్నినల్స్ వద్ద బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో పొగలు బస్సు అంతా వ్యాపించాయి. అప్పటికే బస్సు నుంచి పొగ వాసన రావడంతో ప్రయాణికుల్లో చిన్నపాటి అలజడి మొదలైంది.

Advertisement

అప్రమత్తమై డ్రైవర్.. ప్రయాణికులను దింపేసిన బస్సు డ్రైవర్

వెంటనే డ్రైవర్ అప్రమత్తమై, ప్రయాణికులను బస్సు నుంచి దించివేశారు. పొగలు రాగానే అలర్ట్ అయిన బస్సు సిబ్బంది, అగ్నిమాపకం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఏపీ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అయ్యింది. సాయి ఆర్కే ట్రావెల్స్ పేరు మీదుగా నడుస్తోంది.

ఈ ఘటనపై ప్రయాణికులు నోరు విప్పారు.  ప్రమాదం విజయవాడలో జరిగిందని కాబట్టి తాము బయటపడ్డామని,  అదే రన్నింగ్‌లో జరిగితే అస్సలు ఊహించుకోలేమని అంటున్నారు.  దేవుడి దయవల్ల తాము సేఫ్‌గా బయటపడ్డామని చెబుతున్నారు.  దూరంగా వెళ్లే బస్సులను కనీసం రెండు గంటలకు ఒక్కసారి డ్రైవర్లు ఆపుతుంటారు.

ALSO READ: అమరావతిపై మారని జగన్ వైఖరి.. విషం కక్కిన ఆ పార్టీ నేతలు, రైతుల్లో కొత్త టెన్షన్ 

ఎందుకంటే వాహనం వేడెక్కితే ఇంజన్‌లో మంటలు వస్తాయని భావిస్తుంటారు. ప్రభుత్వ బస్సులు ఈ పద్దతి ఫాలో అవుతుంటాయి.  ప్రైవేటు ట్రావెల్స్ అవేమీ పట్టించుకోవు. గమ్యస్థానానికి చేరుకోవాలని భావిస్తుంటారు. ఈ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలే సమ్మర్ కావడంతో ఎండలు మండిపోతున్నాయి. కచ్చితంగా రెండు గంటలకు ఒకసారి బస్సు ఆపితే బాగుంటుందని కొందరు సూచన చేస్తున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×