E-Paper
Advertisement

Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు
Advertisement

Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా  కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి, చూస్తుండగానే అనాథ ఆశ్రమం మొత్తం వ్యాపించాయి. వెంటనే అలర్టయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. మరో ఆరుగురు విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నారు. పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు.. తలుపులు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్‌ లైట్స్‌ అనాథ ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు విద్యార్ధులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఆశ్రమం యాజమాన్యం విద్యార్ధులను  బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స్ నిమిత్తం  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Also Read: జనసేనలోకి దువ్వాడ వాణి? క్లారిటీ ఇచ్చేసిందిగా..

అయితే వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీఎత్తున మంటలు చెలరేగడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైనా కుట్ర కోణం ఉందా? లేకపోతే మామూలుగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×