E-Paper
Advertisement

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?
Advertisement

Anakapalli: ఉమ్మడి విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మా సిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ప్లాంట్‌‌లో‌ భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇద్దరు కార్మికులు అక్కడే ఉన్నారు. వారిద్దరు సజీవ దహనమయ్యారు. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలీదుగానీ దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మృతులు అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు. ఒకరు వెంకటేష్ కాగా మరొకరు త్రినాథ్. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఈ ఘటనలో ఇంకా కార్మికులు ఉన్నారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి పోలీసులు-అధికారులు వెళ్లారు. జనరల్‌గా షిఫ్టులో 30 నుంచి 50 మంది కార్మికులు ఉంటారని అక్కడివాళ్లు చెబుతున్నారు. ఘటన మార్నింగ్ షిఫ్ట్‌లో జరిగిందా? లేకుంటే రాత్రి షిఫ్ట్ లో జరిగిందా?

Advertisement

దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి

ఘటన సయమంలో లోపల ఎంతమంది కార్మికులున్నారు? బయటకు ఎంతమంది వచ్చారు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అంటున్నారు. ప్రస్తుతం ప్లాంట్ చుట్టూ ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు.  మరోవైపు అగ్నిప్రమాదం ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదం సమయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ALSO READ: నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×