E-Paper
Advertisement

Anakapalle Fire Accident: ఫార్మాసిటీలో మళ్లీ.. వారంతా సేఫ్

Anakapalle Fire Accident: ఫార్మాసిటీలో మళ్లీ.. వారంతా సేఫ్
Advertisement

Anakapalle Fire Accident: ఉమ్మడి విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది? ఎందుకు చీటికీ మాటికీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? కంపెనీలు సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదా? ఎందుకు కార్మికులు ఆందోళన చెందుతున్నారు? అధికారులు తనిఖీలను గాలికి వదిలేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

అనకాపల్లి సమీపంలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈలోగా ఫైర్ సిబ్బంది రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్లాంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

పరవాడ జవహర్‌లాల్ ఫార్మాసిటీలో వందల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీలో ప్రమాదం జరిగితే, చుట్టుపక్కలున్న కంపెనీలకు మంటలు వ్యాపిస్తున్నాయి. కంపెనీల మధ్య గ్యాప్ లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది.  అయితే మార్నింగ్ వేళ ఫిష్ట్‌లు మారే సమయంలో ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఘటనలు అలాంటివేనన్నది అక్కడి కార్మికుల మాట.

కెమికల్స్ లోపల ఉండడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనలో కార్మికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందిన కంపెనీ స్టాప్, గోడౌన్‌ను ఖాళీ చేశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కెమికల్ గోడౌన్ పూర్తి దగ్దమైంది.

Advertisement

ALSO READ: కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారి.. ఆన్‌‌లైన్‌లో జాకీ-ఆసుతో బిజీ

రీసెంట్‌గా విషవాయువు లీకైన రక్షిత్ ఫార్మా కంపెనీలో ఇలాంటి ఘటన జరిగింది. గ్యాస్ లీక్ కావడం, బాయిలర్స్ బ్లాస్ట్స్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఏదైమైనా ఫార్మాసిటీలో వరసగా చోటు చేసుకున్న ప్రమాదాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×