E-Paper
Advertisement

School bus on fire: తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు

School bus on fire: తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు
Advertisement

School bus on fire: ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో ఒక అనూహ్య ఘటన జరిగింది. పిల్లలను పాఠశాలకు తీసుకురావడం కోసం కంభం పట్టణానికి చెందిన ఆల్ఫా స్కూల్ బస్సు డ్రైవర్‌కు, క్లీనర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో, క్లీనర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

బస్సుకు నిప్పంటించిన క్లీనర్ గోపాల్
కోపాన్ని అదుపు చేసుకోలేని క్లీనర్, అక్కడే ఉన్న పెట్రోల్‌ను తెచ్చి ఆ స్కూల్ బస్సుపై పోసి నిప్పంటించాడు. ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో స్కూల్ బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పింది.

Advertisement

కొద్దిగా రోజులుగా డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం
అయితే కొద్ది రోజులుగా విధులు నిర్వహించుకునే క్రమంలో డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం నడుస్తోందని అందుకే ఇప్పుడు ఈ గొడవకు దారితీసిందని సమాచారం తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, క్లీనర్ చర్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×