E-Paper
Advertisement

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Advertisement

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై హైమా రెడ్డిఅనే ప్రత్యక్ష సాక్షి కీలక విషయాలు వెల్లడించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సు తగలబడుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లాను. కాలిపోతున్న బస్సులో ప్రయణాకుల అస్తిపంజరాలు, మాంసపు ముద్దలను చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాను అని పేర్కొన్నారు.

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నేషనల్ హైవే-44 పై  బైక్‌ని ఢీ కొట్టింది ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు తెలుస్తోంది. 20 మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Also Read: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

Advertisement

బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిందని.. కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. గమనించిన డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను నిద్రలేపాడు. చిన్న ప్రమాదమనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మంటలుఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు. డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×