E-Paper
Advertisement

Alla Nani Resign: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన ఆళ్లనాని

Alla Nani Resign: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన ఆళ్లనాని
Advertisement

Alla Nani Resigned to YSRCP: ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల ముందు నుంచే సీట్లు రాక నిరాశలో ఉన్న కొందరు పార్టీ మారి.. పోటీ చేసి మరీ గెలిచారు. ఎన్నికల తర్వాత వైసీపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒక్కొక్క నేత పార్టీని వీడుతుండటంతో.. వైసీపీ కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.

తాజాగా ఆ పార్టీలో కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వారంరోజుల క్రితమే ఆయన పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తాజాగా.. వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు.

Advertisement

Also Read: వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెన్నంటే ఉన్న ఆళ్లనాని.. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. పార్టీలో అంతర్గత కలహాలను తీర్చి.. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా, 2019 ఎన్నికల తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

ఆళ్లనాని కూడా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఏలూరులో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయింది. వైసీపీలో కీలక నేతలు రాజీనామా చేస్తుండటంతో ఆ పార్టీ అయోమయంలో ఉంది. ఎంత చేసినా ప్రజలెందుకు తనను కాదనుకున్నారనే దానిలోనే జగన్ ఉండిపోయారనడంలో సందేహం లేదు. పార్టీలో నేతలు వదిలి వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించలేదు. ఇలాగే కొనసాగితే.. మరికొన్ని నెలల్లో వైసీపీ మొత్తం ఖాళీ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×