E-Paper
Advertisement

EC Serious on Tenali MLA Sivakumar: తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశం..!

EC Serious on Tenali MLA Sivakumar: తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం.. అదుపులోకి తీసుకోవాలని ఆదేశం..!
Advertisement

Elections Commission Serious on YSRCP MLA A Sivakumar: తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ గృహ నిర్బంధంలో ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్ పోలింగ్ బూత్ లోకి క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న ఓటర్లు ఆయనను నిలదీశారు. వెంటనే కోపంతో ఎమ్మెల్యే  ఓ ఓటరుపై చేయి చేసుకోగా..బాధిత ఓటరు కూడా ఎమ్మెల్యే శివ కుమార్ ను తిరిగి కొట్టాడు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

Advertisement

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు..టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. దీంతో చివరి గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఫోకస్ పెంచింది.

తెనాలి, పుంగనూరు సంఘటనలను ఖండించిన ఈసీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. పోలింగ్ బూత్ ఆక్రమణ , ఘర్షణలు జరగకుండా చూడాలని తెలిపింది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×