E-Paper
Advertisement

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్
Advertisement

ED Raids In AP Liquor Case : ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా? ఈడీ దూకుడుగా వెళ్తోందా? శుక్రవారం నిందితుల ఇళ్లలో సోదాలు ముమ్మరం చేసిందా? కేసు  ముగిసిందని భావించిన తరుణంలో ఈడీ సోదాలతో వైసీపీ నేతల్లో కలకలం మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు

Advertisement

ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఒకరి తర్వాత మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులోభాగంగా తొలుత ఐటీ రంగంలోకి దిగింది. నిందితులకు సంబంధించి, వారికి సహకరించిన బంగారు యజమానుల ఇళ్లలో సోదాలు చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

తాజాగా ఇప్పుడు ఈడీ వంతైంది. ఈ కేసులో కీలక నిందితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు సోదాలు తీవ్రం చేశారు. కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్‌ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.

Advertisement

నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్

హైదరాబాద్, తిరుపతితోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. వీరంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఇప్పటికే నిర్ధారించింది.  వీరిలో చాలామంది అరెస్ట్ కాగా, కొంతమంది బెయిల్‌పై ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ వంతైంది.

ఈ కేసులో సిట్ ఇంకా విచారణ జరుపుతోంది. నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తుకు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంది. అక్రమంగా వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించినట్టు తేల్చింది. మళ్లీ అక్కడి నుంచి వైట్ రూపంలో నిధులు తిరిగి తీసుకొచ్చినట్టు గుర్తించారు.

ALSO READ: వైసీపీ పాలనలో విద్యుత్ రంగానికి గ్రహణం.. ఛార్జీల భారంతో ప్రజల నడ్డి విరిచారు: సీఎం చంద్ర‌బాబు

దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సిట్ సేకరించింది. మరొక నిందితుడు అనిల్ చోక్రా.. షెల్ కంపెనీలను మేనేజ్ చేసినట్టు సిట్ నిర్ధారించింది. సుమారు 25 కంపెనీలను ఆయనొక్కడే చూస్తున్నట్లు సిట్ అంతర్గత సమాచారం.  ఉన్నట్లుండి ఈడీ సోదాలు చేస్తుండడంతో  కొందరు వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు చివరి అంకానికి చేరుకున్న ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశంతో ఏం జరుగుతుందోనని అంటున్నారు.  ఈడీ సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×