E-Paper
Advertisement

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్
Advertisement

Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు పేరెత్తగానే వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటర్ కావడం కొత్త మలుపు తిరిగింది. బుధవారం ఏకంగా ఆరు రాష్ట్రాల్లోని 15 చోట్ల దాడులు చేసింది. దాదాపు రూ.60 లక్షలు సీజ్ చేసింది ఈడీ. దీని ద్వారా కొల్లగొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మరొక మలుపు తిరిగింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు

Advertisement

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో ఈడీ రంగంలోకి దిగేసింది. బుధవారం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో సోదాలు చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీల్లో ఈ దాడులు జరిగాయి.

మహారాష్ట్రలోని అహల్యానగర్, ముంబైలలో సోదాలు జరిగాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, రూర్కీ, తమిళనాడులోని దిండిగల్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. డెయిరీల యజమానులు, ప్రతినిధులు, హవాలా లావాదేవీల్లో పాల్గొన్న ఏజెంట్లు, నకిలీ రికార్డులు క్రియేట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసింది ఈడీ.

Advertisement

రూ. 60 లక్షలు సీజ్.. నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు

అయితే స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. వారు కుటుంబసభ్యుల పేరిట చరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. వాటి విలువ దాదాపు రూ. 45 కోట్ల రూపాయలుగా చెప్పుకొచ్చింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ ప్రతినిధులు, ఇతరులతో కలిసి భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది.

డెహ్రాడూన్‌లో ఖరీదైన ప్రాంతాల్లో మూడు వాణిజ్య స్థలాలు కొన్నట్లు ఈడీ గుర్తించింది. వాటి విలువ దాదాపు రూ.7.80 కోట్లు. భోలేబాబా డైరెక్టర్‌ పొమిల్‌ జైన్‌ తన సంస్థ కంపెనీ నుంచి రూ.1.18 కోట్లు మళ్లించుకుని భారీ భవనం కొనుగోలు చేసినట్టు తేలసింది. మరికొన్ని స్థిరాస్తులు కొన్నట్లు తేలడంతో వాటిపై ఈడీ ఆరా తీస్తోంది. ఈడీ దాడుల విషయం తెలియగానే  వైసీపీలో చిన్నపాటి టెన్షన్ మొదలైంది.  తమవైపు ఈడీ చూస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

ALSO READ:  తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×