E-Paper
Advertisement

Cm Chandrababu: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్లీన్ చిట్.. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, కేసు ఏంటో తెలుసా?

Cm Chandrababu: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్లీన్ చిట్.. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, కేసు ఏంటో తెలుసా?
Advertisement

Cm Chandrababu: ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కష్టాలు తొలగిపోయాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర లేదని ఈడీ తేల్చేసింది. ఆయన్ని నిందితుడిగా చేర్చలేమని న్యాయస్థానంలో వేసిన ఛార్జిషీటులో ప్రస్తావించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్లీన్ చిట్.. సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్ 

Advertisement

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ మొదటి నుంచి చెప్పిందే జరిగింది. చివరకు ఈడీ కూడా అదే విషయాన్ని న్యాయస్థానంలో పేర్కొంది. ఏపీలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో జనవరి 28న విశాఖలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది.

న్యాయస్థానం దాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గుర్తించినట్టు పేర్కొంది. అందులో చంద్రబాబు పాత్ర ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని పేర్కొంది. ఆయనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొంది.

Advertisement

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చంద్రబాబు బిగ్ రిలీఫ్

నిధుల మళ్లింపు లేదా దుర్వినియోగంలో అప్పటి ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఏపీలోకి స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఒకటి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్టుకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది గత వైసీపీ ప్రభుత్వం.

వైసీపీ అధికారంలోకి రాగానే దీనిపై కేసు నమోదు చేసింది. 2023 ఏడాది చంద్రబాబును ఈ కేసులో అరెస్టు చేసింది. 53 రోజులపాటు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్ మెంట్‌కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగింది. చంద్రబాబును అరెస్టు చేయడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.

ALSO READ: రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి, రెండువారాలు అక్కడే

దీనిపై జగన్‌, వైసీపీ నాయకులు ఎంతో గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. చివరకు ఈడీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడంతో వారి నోళ్లు మూతబడ్డాయి.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద ఏపీ వ్యాప్తంగా సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లు అంచనా.

ఈ ప్రాజెక్టులో అక్రమాలు పెరిగి ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లు నష్టం జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. 2023 సెప్టెంబరు 9న నంద్యాలలో అర్ధరాత్రి సమయంలో చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 53 రోజులు గడిపారు. అక్టోబరు 31న న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఈడీ కూడా రంగంలో దిగి దర్యాప్తు మొదలుపెట్టింది.

ఈ కేసులో ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో వికాస్‌, సుమన్‌ బోస్‌, అగర్వాల్‌, సురేశ్‌ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది. డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ పేరిట రూ.31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను జప్తు చేసింది. జనవరి 28న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది ఈడీ. డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌, వికాస్‌, సుమన్‌ బోస్‌, ముకుల్‌ చంద్ర అగర్వాల్‌, సురేశ్‌ గోయల్‌ తదితరులను నిందితులుగా పేర్కొంది. చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో ఆయన్ని నిందితుడిగా చూపలేమని తేల్చింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×