E-Paper
Advertisement

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ

EC Suspends Police Officials: ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్.. మరికొందరిపై విచారణ
Advertisement

Election Commission Serious on Violence in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు పడింది. వీరందరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 12 మంది పోలీసు అధికారులపై వేటు పడింది.

Advertisement

ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశంపై దర్యాప్తు చేసి ఒక్కో కేసుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఈసీ కోరింది.

Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

ఫలితాల ప్రకటన తర్వాత జరిగే హింసను నియంత్రించడానికి 25 సిఏపీఎఫ్ కంపెనీలను కౌంటింగ్ తర్వాత 15 రోజులు పాటు కావాలని ఏపీ ప్రభుత్వం అడగగా.. ఈసీ కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement

ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండపై భౌతికంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. దీంతో వారు ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీ పోలీస్ అధికారులపై ఉక్కుపాదం మోపింది ఈసీ.

Also Read: AP Govt. to form SIT: ఏపీలో చెలరేగిన అల్లర్లపై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×