E-Paper
Advertisement

Janasena Symbol: కోర్టుకు తెలిపిన ఈసీ, జనసేన గుర్తుపై క్లారిటీ

Janasena Symbol: కోర్టుకు తెలిపిన ఈసీ, జనసేన గుర్తుపై క్లారిటీ
Advertisement

Janasena Symbol: జనసేన పార్టీ సింబల్ వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అన్ని నియోజకవర్గాలకు గాజు గ్లాసు గుర్తును అధికారులు కేటాయింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. అసలేం జరిగింది?

జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు కాకినాడ, మచిలీపట్నంతోపాటు ఆ పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నిర్ణయంతో జనసేన‌కు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన న్యాయస్థానం, విచారణను క్లోజ్ చేసింది. ఈ లెక్కన స్వతంత్రులకు గ్లాసు గుర్తు క్యాన్సిల్ అయినట్టే.

Advertisement

తమ పార్టీ పోటీ లేని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవద్దని హైకోర్టును జనసేన మంగళవారం ఆశ్రయించింది. దీనిపై 24 గంటల్లోగా క్లారిటీ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఈసీ నివేదిక అందజేసింది.

ALSO READ:  చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం జగన్

Advertisement

జనసేన పోటీ చేసే సీట్లతోపాటు దాదాపు 50 నియోజకవర్గాల్లో ఆ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో జనసేన అభ్యర్థులు అయోమయంలో పడడంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఈవీఎంల్లో జనసేన గుర్తు నెంబరు తెలుసుకుని దానిపై సోషల్ మీడియాతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×