E-Paper
Advertisement

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..

Earthquake in srikakulam: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..
Advertisement

Earthquake in srikakulam: శ్రీకాకుళం జిల్లాను భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల 40 నిమిషాలకు ఒకసారి, నాలుగు గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు మూడు సెకన్ల సేపు కంపించినట్టు ప్రజలు చెబుతున్నారు.

ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నమాట. గతంలో ఈ విధంగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

రెండుసార్లు ప్రకంపనలు రావడంతో అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించి త్వరలో వెల్లడిస్తామన్నారు. రెండేళ్ల కిందట కూడా ఇదే విధంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు వణికిపోయారు. గడిచిన 60 ఏళ్లలో ఇలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×