E-Paper
Advertisement

నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!
Advertisement

Divvela Madhuri: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను కొత్తూరు పోలీసులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పీఎస్ కు వెళ్లిన ఆయన్ను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నాయి. అయితే 4 గంటలు దాటినా దువ్వాడ స్టేషన్ నుంచి బయటకు రాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ఒక్కసారిగా మెుదలయ్యాయి. దీంతో దివ్వెల మాధురి హుటాహుటీనా కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకొని ఆందోళనకు దిగారు. తన అనుచరులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించారు. దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే బయటకు పంపాలంటూ పట్టుపట్టారు.

2025 మార్చిలో పవన్ కళ్యాణ్ పై దువ్వాడ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గొట్ట గ్రామానికి చెందిన జనసేన నేత పి.చిన్నారావు అప్పట్లోనే హిరమండలం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొత్తూరు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని దువ్వాడ శ్రీనివాస్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో మూడోసారి ఈనెల 20న మరోసారి నోటీసు జారీ చేశారు. దీంతో సోమవారం దువ్వాడ శ్రీనివాస్‌ కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

Advertisement

Also Read: ‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

విచారణ సాగుతున్న క్రమంలోనే.. తన అన్నను అరెస్టు చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ బాబా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఒక్కసారిగా దుమారం రేపింది. అప్పటికే శ్రీనివాస్ కోసం బయట పడిగాపులు కాస్తున్న ఆమె.. ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట బైఠాయించి.. పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ఎమ్మెల్సీని విచారణ పేరుతో ఇంత సేపు స్టేషన్ లో ఉంచుతారా? అంటూ ప్రశ్నించారు. దువ్వాడ అనుచరులతో కలిసి.. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. మర్డర్ చేసినోళ్లని, డ్రగ్స్ తీసుకున్నోళ్లని, రేప్ చేసిన వాళ్లని వదిలేస్తారు గానీ.. ఎమ్మెల్సీని మాత్రం ఇంత సేపు స్టేషన్ లో ఉంచుతారా అంటూ ఉగ్రరూపం చూపించారు.

Advertisement

Also Read: ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×