E-Paper
Advertisement

Duvvada srinivas: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి

Duvvada srinivas: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి
Advertisement

Duvvada srinivas: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగు తోంది. తన భార్య వాణి చేసిన కామెంట్స్‌పై కౌంటరిచ్చారు ఆమె భర్త శ్రీనివాస. అంతేకాదు ఈ పంచాయతీ అంతా వైసీపీ అధిష్టానానికి తెలుసని, హైకమాండ్‌ని బ్లాక్ మెయిల్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో దువ్వాడ శ్రీను-వాణి వ్యవహారం మరింత ముదిరిపాకాన పడింది.

శనివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అసలు గుట్టు బయటపెట్టారు. తన ఫ్యామిలీ తనపై దాడి చేస్తుందని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ పంచాయతీ వైసీపీ అధిష్టానం వద్దకు వెళ్లిందన్నారు.

Advertisement

టెక్కలి టికెట్ విషయంలో హైకమాండ్‌తో నాలుగు సిట్టింగులు జరిగాయన్నారు. టికెట్ తనకు ఇవ్వాల్సిం దేనని వాణి డిమాండ్ చేసిందన్నారు. శ్రీను నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఒత్తిడి చేసిందన్నారు . తాను చెప్పినవి చేయకుంటే.. ఉరి వేసుకుని చస్తానంటూ పార్టీ హైకమాండ్‌ను వాణి బ్లాక్ మెయిల్ చేసిందని దుయ్యబట్టారు.

ALSO READ: మిడ్‌నైట్ హంగామా.. భార్యపై దాడికి దువ్వాడ శ్రీను యత్నం.. పోలీసుల జోక్యంతో?

Advertisement

కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలన్న దువ్వాడ శ్రీనివాస్, కుటుంబమే తనపై దాడి చేస్తోందని ఆవేదక వ్యక్తంచేశారు. ఓ కూతురికి పెళ్లి చేశాను.. మరో కూతురుకి మ్యారేజ్ చేయాల్సి ఉందన్నారు. మైనింగ్ క్వారీలను తన పేరు మార్చాలని వాణి తనపై ఒత్తిడి చేస్తోందని, తాను ఆమెను గుండెల మీద పెట్టుకున్నానని మనసులోని మాట బయటపెట్టాడు. వాణి తన గురించి పిల్లలకు చెడుగా చెప్పిందన్నారు.

తన భార్యకు టికెట్ ఇవ్వాలని జగన్‌కు చెప్పానని గుర్తు చేశారు దువ్వాడ శ్రీనివాస్. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా తన ఫ్యామిలీపై చర్చ జరుగుతోందన్నారు. వాణి ఆధ్వర్యంలో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, పార్టీకి వచ్చిన రిపోర్టు ప్రకారం తనకే అధిష్టానం టికెట్ కేటాయించిందన్నారు. తనకు గ్రానైట్ వ్యాపారమని, వచ్చిన సొమ్మంతా వాణికే ఇచ్చానని వివరించే ప్రయత్నం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×