E-Paper
Advertisement

Tirumala Drone: తిరుమల కొండపై మరోసారి డ్రోన్ కలకలం.. అలిపిరి తనిఖీలపై అనుమానాలు

Tirumala Drone: తిరుమల కొండపై మరోసారి డ్రోన్ కలకలం.. అలిపిరి తనిఖీలపై అనుమానాలు
Advertisement

Tirumala Drone: తిరుమల కొండపై మరోసారి డ్రోన్ కెమెరా కలకలం రేగింది. శిలాతోరణం వద్ద భక్తులు డ్రోన్ కెమెరా ఎగువవేశాడు. తిరుమల శిలాతోరణం ఫారెస్ట్ ఏరియాలో ఇస్కాన్ భక్తులు సులక్షణ దాస్, అర్జున్ దాస్ శుక్రవారం డ్రోన్ లతో విజువల్స్ తీస్తుండడాన్ని ఫారెస్ట్, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.

శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం

నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమల ఆలయ భద్రత దృష్ట్యా టీటీడీ డ్రోన్ కెమెరాలను నిషేధించింది. ఒక్కొసారి భక్తుల అత్యుత్సాహం టీటీడీకి తలనొప్పిగా మారుతుంది. తిరుమలలో డ్రోన్ కెమెరాలు నిషేధించినప్పటికీ కొందరు భక్తులు వాటిని వాడటం మాత్రం మానడం లేదు. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ భక్త బృందం డ్రోన్ కెమెరాతో విజువల్స్ చిత్రీకరిస్తుండగా.. అక్కడున్న మిగతా భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అయితే తిరుమలకు డ్రోన్ కెమెరాల నిషేధం ఉన్నప్పటికీ.. అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీల్లో బయటపడలేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలిపిరి వద్ద భద్రతా తనిఖీలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

హెలికాఫ్టర్లు, డ్రోన్లపై నిషేధం

Advertisement

కలియుగ దైవం తిరుమల ఏడుకొండల పరిధిలో విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరవేయకూడదని అంటుంటారు. శుక్రవారం తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేసిన వ్యక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Also Read: TTD VIP Darshan Cancelled: టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

భద్రతా సిబ్బంది కళ్లు గప్పి

Advertisement

అలిపిరి చెక్ పాయింట్ లో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి డ్రోన్ ను తిరుమలకు ఎలా తీసుకొచ్చారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమరాను తిరుమలకు తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ భక్తుడిని విచారిస్తున్నారు అధికారులు. తిరుమల కొండపై ఇటీవల విమానాలు, డ్రోన్లు ఎగరడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీని కోరుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×