E-Paper
Advertisement

Case Filed on Director RGV: పోలీసుల విచారణకు ఆర్జీవీ డుమ్మా.. ఫోన్ ద్వారా సమాచారం

Case Filed on Director RGV: పోలీసుల విచారణకు ఆర్జీవీ డుమ్మా.. ఫోన్ ద్వారా సమాచారం
Advertisement

Case Filed on Director RGV: అందరూ భావించినట్టుగా ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు తాను వస్తానని, కాకపోతే నాలుగు రోజులు గడువు కావాలని అధికారులను కోరారు. ఈ లెక్కన శుక్రవారం విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ప్రకాశం పోలీసులకు తాను నాలుగు రోజుల తర్వాత వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు ఫిల్మ్ మేకర్ రామ్‌గోపాల్ వర్మ. షూటింగ్ నిమిత్తం తాను బిజీగా ఉన్నారని అందులో పేర్కొన్నారట.  దానికి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందో తెలీదు. కాకపోతే మంగళవారం విచారణకు మాత్రం హాజరుకాలేదు.

Advertisement

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు ఆర్జీవీ. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నోటీసులను స్వయంగా తీసుకెళ్లి వర్మకు అందజేసిన విషయం తెల్సిందే.

వర్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. వర్మ విచారణకు రాకపోవడంతో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే దానిపై ఆసక్తికరంగా మారింది. 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు పోలీసులు. రాకపోతే వర్మను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Advertisement

ALSO READ:  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

విచారణ విషయంలో రామ్ గోపాల్‌వర్మ వెనుకడుగు వేశారన్నది కొందరి మాట. ఒక్కసారి విచారణకు వెళ్తే ఇరుక్కుంటామని, వెళ్లకుండా తప్పించుకోవడమే బెటరని తెలుస్తోంది. దీనిపై గత రాత్రి వైసీపీకి చెందిన కొందరు న్యాయవాదులతో మంతనాలు జరిపారట. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని, గడువు కోరాలని సలహా ఇచ్చారట.

మరోవైపు షూటింగ్‌ నిమిత్తం విచారణకు హాజరుకాలేకపోయానని చెబుతూ పిటిషన్ వేసేందుకు ఆర్జీవీ సిద్దమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×