E-Paper
Advertisement

Recording Dance: ధర్మవరం తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్స్.. స్టేజీపై జనసేన ఫ్లెక్సీలు.. రాజకీయంగా రచ్చ

Recording Dance: ధర్మవరం తిరునాళ్లలో రికార్డింగ్ డ్యాన్స్.. స్టేజీపై జనసేన ఫ్లెక్సీలు.. రాజకీయంగా రచ్చ
Advertisement

Recording Dance: నాయకుల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్‌ ప్రోగ్రాం జరిగింది. అయితే ఈ వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. డాన్స్ ప్రోగ్రాం వేదికపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల కింద చిన్నారులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున చూస్తుండగానే, మహిళలతో అసభ్యకరంగా స్టెప్పులు వేయించడం వివాదంగా మారింది.

స్పందించని జనసేన

రికార్డింగ్ డ్యాన్స్‌ వేస్తున్న స్టేజీపైనే జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి సొంతూరు ధర్మవరం కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ రికార్డింగ్ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, జనసేన పార్టీ ఇప్పటి వరకు ఈ వీడియోలపై స్పందించలేదు.

Advertisement

Also Read: Guntur News: లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్, చివరకు? 

కానిస్టేబుల్ అసభ్యకర నృత్యాలు

కృష్ణా జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ మహిళతో చిన్నారుల ఎదుట చేసిన అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Advertisement

కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ముందు అశ్లీల నృత్యాలు చేయడంపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు అజయ్‌ కుమార్‌ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడ్ని సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. హోంగార్డు అశ్లీల నృత్యాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నా్రుల ముందు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ డ్యాన్స్ చేయడంపై మండిపడుతున్నారు. చిన్న పిల్లలు ఎదుట ఇలాంటి నృత్యాలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×