E-Paper
Advertisement

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్యకు డిప్యూటీ సీఎం పవన్, ఎంపీడీవోకు పరామర్శ, నిందితుడు అరెస్ట్

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్యకు డిప్యూటీ సీఎం పవన్, ఎంపీడీవోకు పరామర్శ, నిందితుడు అరెస్ట్
Advertisement

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్య జిల్లాలో దాడి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎంపీడీవో దాడి చేసినవారిని వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబును పరామర్శించనున్నారు.

శనివారం ఉమ్మడి కడప జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించ నున్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడికి పాల్పడ్డారు.

Advertisement

ఈ ఘటనలో ఎంపీడీఓకు తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. విధి నిర్వహణలోఉన్న అధికారులపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా వర్ణించారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదన్నారు. దాడి ఘటన గురించి అధికారులతో చర్చించారు డిప్యూటీ సీఎం.

ఘటనకు కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు డిప్యూటీ సీఎం. వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదన్నారు.

Advertisement

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం. ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ALSO READ: జ‌గ‌న్‌ను బిగ్ షాక్.. మ‌రో నేత రాజీనామా

మరోవైపు డిప్యూటీ టూర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గాలివీడు కార్యక్రమం రద్దు అయినట్టు తెలుస్తోంది. నేరుగా కడప రిమ్స్‌కు వెళ్లి ఎంపీడీఓను పరామర్శించి, అక్కడి నుంచి కమలాపురం వెళ్లనున్నారు. వల్లూరు మండలంలోని పైడి కాలువ ఇసుక రీ‌లను పరిశీలించనున్నట్లు సమాచారం.

డిప్యూటీ సీఎం పవన్ టూర్‌ను వైసీపీ నేతలు రాజకీయ కోణంలో చూస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్యాన్స్ పార్టీకి చెందిన దిగువశ్రేణి నాయకత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో దాడులకు దిగుతున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కడప జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×