E-Paper
Advertisement

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..

YCP Ex MLA Karanam Dharmasri: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..
Advertisement

YCP EX MLA Karanam Dharmasri On His Defeat: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యింది జగన్ పార్టీ. అయితే ఇప్పుడా పార్టీ ఓటమికి కారాణాలు వెతుక్కుంటోంది. ఒక్కొరుగా బయటకు వచ్చి ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

తాజాగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయినట్లు చెప్పారు. బీన్ రహదారి గోతులే తన ఓటమికి ప్రధాన కారణమని.. జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. జగన్ చూపిన నిర్లక్ష్యం వల్లే చోడవరం ఓటర్లు తనని ఓడించారన్నారు ధర్మశ్రీ. దాదాపు రూ. 2 కోట్ల సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టానని.. కూటమి ప్రభుత్వం ఆ డబ్బలు ఇస్తుందో లేదోనని అన్నారు.

Advertisement

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఓటమి గురించి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామని అందుకే ప్రజలు తమను గద్దె దించారన్నారు. అవే తప్పులు చేస్తూ అదే తీర్పును కోరుకుంటారా అని టీడీపీ నేతలను ప్రశ్నించారాయన.

ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వస్తే వైసీపీ సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీటు, జడ్పీటీసులు వారికి స్వాగతం పలకాలని తెలిపారు. వారికి ఆహ్వానం పలికి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం వారి ఇష్టం అని అన్నారు.

Advertisement

Also Read: రాజంపేట మేడా.. మల్లిఖార్జునరెడ్డిపై చంద్రబాబు ఫోకస్

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ వైసీపీ తరఫున పోటీ చేసి సమీప టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు చేతిలో 42189 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓటమి చవిచూశారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×