E-Paper
Advertisement

Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?

Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?
Advertisement

Prakasam District:  ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి..  వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే కీచకుడిగా మారడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దర్శి పట్టణంలోని ఒక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న ఒక చిన్నారి పట్ల ఆయన గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆ ఉపాధ్యాయుడు మరోసారి హద్దు మీరి ప్రవర్తించడంతో..  బాధితురాలు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని విని చలించిపోయిన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.

Advertisement

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు,  స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలంటూ పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న దర్శి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.

ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు నిందితుడు వెంకటేశ్వర్లును తమ అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో ఉన్న జనాల నుండి అతడిని రక్షించి..  విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ‘పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలను సేకరించి..  నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ALSO READ: Diamond Jewellery Robbery: జస్ట్ 5 మినిట్స్.. అలా వచ్చారు.. ఇలా రూ.10 కోట్ల ఆభరణాలు తీసుకెళ్లారు..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×