E-Paper
Advertisement

Vizag: భర్త కొట్టడంతో డాన్సర్ మృతి

Vizag: భర్త కొట్టడంతో డాన్సర్ మృతి
Advertisement

Vizag: భార్య, భర్తల మధ్య గొడవలు కామన్. కానీ కొన్నిసార్లు క్షణికావేశాల్లో చేసే పొరపాట్ల వల్ల తమ తమ జీవితాలను కోల్పోవాల్సి వస్తోంది. ఈ మధ్య భార్య భర్తల గొడవల కేసులు తరచుగా చూస్తునే ఉన్నాం. సినిమా ఆర్టిస్టులు, డ్యాన్సర్స్‌ ఇండస్ట్రీలో తమ కెరీర్‌ను సాగించాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కానీ కొందరి జీవితాల అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా భర్త కొట్టడంతో డ్యాన్సర్ మృతి చెందిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ డాన్సర్స్ అసోసియేషన్లో భర్త బంగార్రాజు, మృతురాలు రమాదేవి ఇద్దరు డ్యాన్సర్స్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు కలిసి మాధవధారలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే.. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడంతో, అల్లిపురం వెంకటేశ్వర మెట్టు వద్ద తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది మృతురాలు రమాదేవి. దీంతో.. మూడు రోజుల క్రితం బంగార్రాజు అత్తగారి ఇంటికి అల్లిపురం వెళ్లి భార్య రమాదేవితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో.. భర్త బంగార్రాజు కొట్టడంతో పక్కనే ఉన్న కరెంట్ పోల్‌కి రమాదేవి తల తగిలి గాయాల పాలైంది. తల భాగానికి గాయం కావడంతో, కేజీహెచ్‌కి తరలించారు. అయితే.. KGH లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో.. భర్త పైన కేసు నమోదు చేసి టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×