E-Paper
Advertisement

Cyclone Michaung : తీరం దాటిన తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. పంటలకు తీవ్ర నష్టం..

Cyclone Michaung : తీరం దాటిన తుపాను.. ఏపీలో భారీ వర్షాలు.. పంటలకు తీవ్ర నష్టం..
Advertisement
AP Breaking news today

Cyclone Michaung update(AP breaking news today):

మిగ్‌జాం తుపాను తీరం దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటిన ‘మిగ్‌జాం’ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు రెండు మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.

తుపాను ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరుగుతోంది. రాయలసీమలోనూ తుపాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×