E-Paper
Advertisement

Cyclone Montha: ఏపీలో వేగంగా కదులుతున్న మొంథా.. కాకినాడ తీరానికి, అత్యంత భారీ వర్ష సూచన

Cyclone Montha: ఏపీలో వేగంగా కదులుతున్న మొంథా.. కాకినాడ తీరానికి, అత్యంత భారీ వర్ష సూచన
Advertisement

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను అలజడి రేపుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారింది.

ఏపీని కుదిపేస్తున్న మొంథా తుపాను

Advertisement

ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వెల్లడించింది.

తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Advertisement

తీవ్రతుపానుగా మారిన మొంథా

అంతర్వేది, రాజోలు, అమలాపురం, దేవగుప్తం, కాట్రేనికోన, పోలవరం, యానాం, గుట్టెనదీవి, ముమ్మిడివరం దగ్గర తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ కేంద్రం.  తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటల 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కోస్తాలోని పలు ప్రాంతాల్లో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

తీరం దాటే సమయంలో ఈ స్థాయి పెరగవచ్చని తెలిపింది. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దాదాపు 21 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. ఐదురోజులపాటు ఏపీలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశముంది.

ALSO READ:  గ్రేటర్ తిరుపతి సాధ్యమేనా, అడ్డంకులు ఏంటి?

తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంది. ప్రజలు వదంతులు నమ్మకుండా వాస్తవ సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే అవసరమైన సాయం కోసం ఆ నెంబర్లను సంప్రదించాలని కోరింది. స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ల 112, 1070, టోల్ ఫ్రీ నెంబర్లు 18004250101.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×