E-Paper
Advertisement

Currency Notes in Containers: ఏపీ.. కంటైనర్లలో కరెన్సీ నోట్లు.. 2,000 వేల కోట్లు సీజ్ చేసిన పోలీసులు..?

Currency Notes in Containers: ఏపీ.. కంటైనర్లలో కరెన్సీ నోట్లు.. 2,000 వేల కోట్లు సీజ్ చేసిన పోలీసులు..?
Advertisement

Currency notes in Containers in Andhra Pradesh During the Elections 2024: ఏపీలో కంటైనర్లలో కరెన్సీ నోట్ల కట్టలు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు. తనిఖీల్లో ఆ నోట్ల కట్టలను చూసి పోలీసు అధికారులే షాకయ్యారు.

మనీ కంటైనర్లు ఎక్కడ నుంచి వస్తోంది? ఎక్కడకు వెళ్తోంది? ఈ డబ్బు అంతా ఎవరిది? సెక్యూరిటీ లేకుండా అంత డబ్బు ఎలా తీసుకెళ్తున్నారు? అసలే ఎన్నికల సమయం, అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అనుకుందాం. దానికి సెక్యూరిటీ అవసరం లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

Advertisement

ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో మూడురోజుల కిందట రెండు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. దీంతో జాతీయ రహదారులు, జిల్లాల సరిహద్దుల వద్ద భారీ ఎత్తున పోలీసులను మొహరించారు. తాజాగా అనంతపురం పామిడి వద్ద నాలుగు కంటైనర్లను పోలీసులు తనిఖీలు చేశారు. కంటైనర్లు ఓపెన్ చేయగానే అందులోని బాక్సులు చూసి షాకయ్యారు. ఒక్కో కంటైనర్లలో 500 కోట్ల రూపాయలు ఉన్నాయి.

Also Read: జగన్‌పై రుసరుస, అక్కడ రాకుండా స్కెచ్.. ఆయన వెనుక సీఎం?

Advertisement

వాటిలో 500 నోట్లను తరలిస్తున్నట్లు నిర్థారించారు. వాటి విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. అయితే ఆ కంటైనర్లను ఆర్బీఐకి చెందినవిగా అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రికార్డులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

కంటైనర్ల వ్యవహారంలో ప్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత వాటిని హైదరాబాద్‌కు పంపిస్తామని పోలీసులు చెబుతున్నమాట.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×