E-Paper
Advertisement

Vallabhaneni Vamsi : వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు

Vallabhaneni Vamsi : వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు
Advertisement

Vallabhaneni Vamsi : వైసీపీ  అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు హైదరాబాద్ లో వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపిన కృష్ణలంక పోలీసుల.. రాత్రి 10 గంటల ప్రాంతంలో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షల్లో అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తేలడంతో..  రిమాండ్ కోరుతూ న్యాయమూర్తి ఎదుట వంశీని తరలిస్తున్నారు.

ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా శివరామ కృష్ణప్రసాద్ లను చేర్చారు. ఏ8గా నిమ్మ లక్ష్మీపతి లను రిమాండ్ రిపోర్టులో చేర్చారు.

Advertisement

దీంతో.. ఈ కేసులో వల్లభనేని వంశీ జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే.. అతనికి న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీని విచారణ కోసం హైదరాబాద్ నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలోనూ  వందల మంది పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పోలీసుల వాహనాలకు అడ్డుగా వచ్చి ఆందోళనలు చేపట్టారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. టీడీపీ ఆఫీసు మీద దాడి కేసుతో పాటు.. ఆ ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేశారనే కేసులు బనాయించారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సమయంలో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 140(1), 308, 351(3) రెడ్‌విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదైంది.  అతను కిడ్నాప్ చేసింది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే.. ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×