E-Paper
Advertisement

Jagan: జగనన్న స్టిక్కర్ల రచ్చ.. మా గోడలపై వద్దంటూ లొల్లి..

Jagan: జగనన్న స్టిక్కర్ల రచ్చ.. మా గోడలపై వద్దంటూ లొల్లి..
Advertisement
jagan sticker

Jagan: ‘జగనన్నే మా భవిష్యత్తు’. వైసీపీ కొత్త నినాదం. ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తున్నారు. వారి ఇంటి గోడపై జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ అంటిస్తున్నారు. అలా రాష్ట్రమంతా జగన్ మయం చేయాలనేది పార్టీ స్ట్రాటజీ.

వైసీపీ వాళ్లైతే ఎంచక్కా జగన్ స్టిక్కర్ అంటించుకుంటారు. మరి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్లు ఎందుకు ఊరుకుంటారు? అదే జరుగుతోంది. ఏపీలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజాగా, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో పెద్ద గొడవే జరిగింది.

Advertisement

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్టిక్కర్లను అతికించడానికి అగురువీధికి వెళ్లారు వైసీపీ నాయకులు. అయితే, జగన్ స్టిక్కర్లు అంటించడానికి ఆ వీధి వాళ్లు ఒప్పుకోలేదు. ఎందుకు అంటించొద్దు అని అధికార పార్టీ వాళ్లు ప్రశ్నిస్తే.. మాకిష్టం లేదంటూ సమాధానం చెప్పారు. స్టిక్కర్లు వేసుకోకపోతే సంక్షేమ పథకాలు అపేస్తాం అంటూ వైసీపీ వర్గీయులు బెదిరించారు. ఎందుకు ఆపుతారు? అంటూ ఎదురు ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ తర్వాత సద్దుమనిగింది. విషయం తెలిసి టీడీపీ జిల్లా నేతలు ఆ వీధివారిని కలిసి మద్దతు తెలిపారు.

మరోవైపు.. కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ పథకాలేవి తమకు అందటంలేదంటూ… కర్నూల్ జిల్లా ప్యాలకుర్తిలో అలీం భాష అనే యువకుడు తన ఇంటికి అంటించిన జగన్‌ స్టిక్కర్‌ను చింపేశాడు. సర్కార్ నుంచి సంక్షేమ పథకాలు రానప్పుడు జగన్ స్టిక్కర్ ఎందుకంటూ పీకేశాడు. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇలా ఏపీ వ్యాప్తంగా జగనన్న స్టిక్కర్ల రచ్చ నడుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×