// // List of AP Congress Candidates - 14 మందితో కాంగ్రెస్ మరో జాబితా.. పలు స్థానాలకు అభ్యర్థుల మార్పు.. -->
E-Paper
Advertisement

List of AP Congress Candidates: 14 మందితో కాంగ్రెస్ మరో జాబితా.. పలు స్థానాలకు అభ్యర్థుల మార్పు..

List of AP Congress Candidates: 14 మందితో కాంగ్రెస్ మరో జాబితా.. పలు స్థానాలకు అభ్యర్థుల మార్పు..
Advertisement

Congress: రాష్ట్రంలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం 14 మంది పేర్లతో కూడిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 3 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణగోపాల్ ప్రకటించారు. అయితే ఈ జాబితాలో పలు స్థానాలకు అధిష్ఠానం అభ్యర్థులను మార్చింది.

3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు వీరే..
1.నర్సాపురం- కొర్లపాటి బ్రహ్మానంద రావ్ నాయుడు
2.రాజంపేట-ఎస్ కే బషీద్
3.చిత్తూరు(ఎస్సీ)- ఎం జగపతి

Advertisement

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా..
1.చీపురుపల్లి- ఆది నారాయణ జమ్ము
2.శృంగవరపు కోట- గేదెల తిరుపతి
3.విజయవాడ ఈస్ట్- పొనుగుపాటి నాంచారయ్య
4.తెనాలి- చందూ సాంబశివుడు
5.బాపట్ల- గంటా అంజిబాబు
6.సత్తెనపల్లి- చంద్రపాల్ చుక్కా
7.కొండపి(ఎస్సీ)- పసుమర్తి సుధాకర్
8.మార్కాపురం-షాహిద్ జావిద్ అన్వర్
9.కర్నూల్- షేక్ జిలానీ భాష
10.ఎమ్మిగనూరు- మరుమళ్ల ఖాసీం వలీ
11.మంత్రాలయం- పీ.ఎస్. మురళీ కృష్ణరాజు

అయితే వీటిలో పలు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను మార్చింది. చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని గతంలో తుమ్మగంటి సూరినాయుడికి కేటాయించగా.. ఈ జాబితాలో అతన్ని కాదని ఆదినారాయణ జమ్ముకు టికెట్ కేటాయించింది. విజయవాడ ఈస్ట్ స్థానాన్ని కూడా సుంకర పద్మశ్రీని కాదని.. పొనుగుపాటి నాంచారయ్యకు అధిష్ఠానం కేటాయించింది.

Advertisement

తెనాలి స్థానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో ఎస్ కే బషీద్ కు కేటాయించింది. అయితే ఈ జాబితాలో అతని స్థానంలో చందూ సాంబశివుడుకు అవకాశం కల్పించింది. కొండపి స్థానాన్ని శ్రీపతి సతీష్ ను కాదని.. పసుమర్తి సుధాకర్ పేరును ప్రకటించింది. మర్కాపుర స్థానానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిని మార్చింది. షేక్ సైదాను మార్చుతూ.. షాహిద్ జావిద్ అన్వర్ కు అవకాశం ఇచ్చింది. అయితే ఇటీవలే అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో కూడా పలు స్థానాలకు అభ్యర్థులను మార్చింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×