E-Paper
Advertisement

Report on AP’s Debt: ఏపీలో అప్పుల కుప్ప.. బయటపెట్టిన కాగ్, వైసీపీ పాలనలో..

Report on AP’s Debt: ఏపీలో అప్పుల కుప్ప.. బయటపెట్టిన కాగ్, వైసీపీ పాలనలో..
Advertisement

Report on AP’s Debt: ఏపీలో అప్పులు ఎంతవరకు ఉన్నాయి? బడ్జెట్‌లో ఏ విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది? ఆర్థిక స్థితిపై కాగ్ తేల్చిన నిజాలేంటి? భారమంతా కూటమి సర్కార్‌పై పడిందా? అవుననే అంటున్నాయి కాగ్ లెక్కలు.

ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతీ రూపాయి బయటపెడుతుంది కాగ్. ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా, కాగ్‌నే అందరూ ప్రమాణికంగా తీసుకుంటారు. ఎవరేమనుకున్నా కాగ్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. వైసీపీ రూలింగ్‌లోని చివరి ఏడాది లెక్కల చిట్టాను బయటపెట్టింది కాగ్.

Advertisement

సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకు వెళ్తుందని తేల్చింది. ఆస్తుల సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే కేటాయించింది. శాసనసభ అనుమతి లేకుండా 634 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు బయటపెట్టింది.

2023-24 ఏడాది ఆర్థిక సంవత్సరం లెక్కల్ని పరిశీలించిన కాగ్, దాదాపు 33 వేల కోట్ల బడ్జెటేతర రుణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖకు తెలియజేసింది. ఇక బడ్జెట్‌లో చూపని రుణాల కోసం అసలు, వడ్డీల రూపంలో 10 వేల కోట్లు పైగానే ఉందన్నది అందులోని సారాంశం.

Advertisement

ALSO READ: : రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య

జీఎస్డీపీలో అప్పుల వాటా 34 శాతంగా పేర్కొంది. 2023-24 ఆర్థిక ఏడాదికి రూ.4, 86, 151 కోట్ల రూపాయలున్నట్లు పేర్కొంది. పెండింగ్‌ బిల్లులు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల మేరా ఉన్నాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి అప్పులు సమీకరిస్తోంది. వాటిని బడ్జెట్‌లో చూపలేదట.

కేంద్రం ఇచ్చిన నిధులు 30 రోజల్లోపు చెల్లించలేదు. దీంతో కేంద్రానికి ఏడు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలా 2023-24 ఏడాదికి 283.96 కోట్ల రూపాయలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని కాగ్ తన లెక్కల్లో ప్రస్తావించింది.

ప్రభుత్వం సరైన సమయంలో నిధులు చెల్లించలేదు. దీంతో వడ్డీ భారం భరించాల్సి వచ్చింది కడిగి పారేసింది కాగ్. ఇదికాకుండా 53 కోట్ల రూపాయలు రెవిన్యూ అవసరాల కోసం ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని మూలధన వ్యయం కింద లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. వైసీపీ ఆర్థికభారమంతా ఇప్పుడు కూటమి సర్కార్‌పై పడింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×