E-Paper
Advertisement

Kadapa: కూలిన బ్రహ్మంగారి నివాసం.. పూర్వపు శైలిలోనే పునర్నిర్మించాలని కలెక్టర్ ఆదేశం

Kadapa: కూలిన బ్రహ్మంగారి నివాసం.. పూర్వపు శైలిలోనే పునర్నిర్మించాలని కలెక్టర్ ఆదేశం
Advertisement

Kadapa: కడప జిల్లాలో ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు, 400 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనపై భక్తుల నుంచి తీవ్ర ఆవేదన, అధికారుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని కడప కలెక్టర్‌ను ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది.

తాజా అప్‌డేట్ ప్రకారం, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్వయంగా అధికారులతో కలిసి కూలిన నివాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, గృహ సంరక్షకులను అడిగి వివరాలు సేకరించారు. బ్రహ్మంగారు తపస్సు చేసిన పవిత్ర స్థలంలోనే, 1978-79 కాలంలో ఈ గృహాన్ని మట్టి, పలకరాయి, చెక్క స్తంభాలతో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

Advertisement

Read Also: Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్

స్వల్పంగా కూలిన ఈ కట్టడాన్ని వెంటనే పునర్నిర్మించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా, పూర్వపు ఉనికిని ఏమాత్రం కోల్పోకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ‘ఇంటాక్’ (INTACH) సంస్థ సహకారం తీసుకోవాలని, అప్పటి నిర్మాణంలో వాడిన అసలైన మెటీరియల్‌నే తిరిగి ఉపయోగించి పునరుద్ధరించాలని సూచించారు. అంతేకాకుండా, ప్రత్యేక ఆర్కిటెక్ట్‌లు, ధార్మిక పరిషత్ సలహాలు కూడా తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపద విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, శిథిలావస్థలో ఉన్నప్పుడే మరమ్మతులు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని భక్తులు విమర్శిస్తున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాల నేపథ్యంలో, కలెక్టర్ సూచనల మేరకు, చారిత్రక కట్టడానికి నష్టం కలగకుండా పాత శైలిలోనే నివాసాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×