E-Paper
Advertisement

Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

Cold Wave: బాబోయ్..! చలి చంపేస్తోంది.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు.. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు
Advertisement

Cold Wave: తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. చలి తీవ్రతకు ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు.. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లాలో చలి తీవ్రత అంతకంతూ పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో గిరిజన ప్రజల వణికిపోతున్నారు. లంబసింగి 4 డిగ్రీలు, చింతపల్లి 6. 8 డిగ్రీలు, పాడేరు 8 డిగ్రీలకు పడిపోయింది.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తెలంగాణలో 10 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం చాలా అరుదు. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్‌ 7.7, వికారాబాద్‌ 8.1, రంగారెడ్డి 8.2, సిరిసిల్ల 8.4, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్‌ 8.9, జగిత్యాల 9, మెదక్‌ 9.3, నిర్మల్‌ 9.4, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 9.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

ఈ సంవత్సరం ముందు నుంచే వణుకుడు..
సాధారణంగా డిసెంబర్‌ నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్ది రోజులపాటు 10 కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ సంవత్సరం నవంబర్‌ నెలలో ఉన్నఫలంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఉదయం దట్టమైన పొగ మంచు కురుస్తోంది.

ఇవాల రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగే అవకాశం..
ఈసారి ఎక్కువ వర్షాలు కురవడం.. తుపాన్లు రావడమే కారణమని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పదేళ్లలో లేనంత చలి ఈసారి ఉందన్నారు. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల నుంచి వస్తున్న శీతలగాలులు మరో కారణమన్నారు. అయితే, ఇవాళ్టి నుంచి క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ, తమిళనాడు వైపు తుపాను రాబోతుందని, సముద్రంలోని వేడిగాలులు భూమి మీదకు చేరి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు.

Advertisement

Also  Read: నేడు ఏపీ, తమిళనాడు పర్యటనకు ప్రధాని మోదీ..

అల్లూరు జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత..
ఏపీలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. అల్లూరి జిల్లాలోని ప్రాంతాలు ముఖ్యంగా అరకు లోయలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, అరకులోయలో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో వణికిపోతున్న గిరిజన ప్రజలు.. చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా  ఉండాలన్న అధికారులు.. ప్రస్తుతం మత్స్యకారులు వేటకు వెళ్లకూడదంటున్న అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×