E-Paper
Advertisement

CM Jagan : పోతే పోనీ.. డోంట్ కేర్..

CM Jagan : వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.. అయితే పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.. పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారంట.. అందుకే కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్లు బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్ గా నేతలకే చెప్తున్నారంట.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి పోతున్నా ఆయన సైలెంట్ ఉండటం అందుకే అంటున్నారు.

CM Jagan : పోతే పోనీ.. డోంట్ కేర్..
Advertisement

CM Jagan : వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.. అయితే పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.. పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారంట.. అందుకే కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్లు బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్ గా నేతలకే చెప్తున్నారంట.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి పోతున్నా ఆయన సైలెంట్ ఉండటం అందుకే అంటున్నారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ జంపింగ్ లు సర్వ సాధారణం.. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి.. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు మారిపోతుంటారు.. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందు నుంచే వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు.. అధికారంలో ఉన్న వైసీపీని కాదని తెర వెనుక టీడీపీతో జత కట్టారు కొందరు ఎమ్మెల్యేలు.. ఆ తెరవెనుక వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బహిర్గతం అవ్వడం.. తరువాత జరిగిన పరిణామాలతో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ పంచన చేరారు..

Advertisement

ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన వైసీపీ.. పార్టీలో అటువంటి వారు ఇంకెంత మంది ఉన్నారా? అని నిఘా పెట్టిందంట.. సొంత పార్టీకి సున్నం పెడుతున్న వారి వివరాలు సేకరిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోందంటున్నారు.. టీడీపీ, జన సేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల వివరాలను రాబడుతున్నారంట.. అభ్యర్థుల మార్పు ప్రక్రియ చేపట్టిన వైసీపీ పక్కచూపులు చూస్తున్న వారి వివరాలను కూడా పరిగణలోకి తీసుకుంటోందంటున్నారు..

సీటు ఆశించి భంగపడ్డ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూనే.. వారు పార్టీలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని.. నేరుగా చెప్పేస్తున్నారంట వైసీపీ ముఖ్యులు.. పార్టీలో ఉంటూనే కోవర్టులుగా మారిన వారిని మాత్రం ఉపేక్షించేది లేదని.. గత ఎన్నికల్లో పదవులు ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించిన అంశాన్ని గుర్తు చేస్తూ.. నమ్మిన వారికే ప్రాధ్యానత ఉంటుందని స్పష్టం చేస్తున్నారంట.

Advertisement

2014 లో వైసీపీ ఓటమి పాలైన తరువాత 23 మంది ఎమ్మేల్యేలు, ముగ్గురు ఎంపిలు పార్టీని వీడిన అంశాన్ని వారందరికీ గుర్తు చేస్తూ.. ఇప్పుడు కూడా పార్టీని వీడి వెళ్ళే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారంట వైసీపీ అధినేత… ఎంత మంది పార్టీని వదిలిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ లోని మిగతా నేతలకు సంకేతాలు పంపుతున్నారంట. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు పార్టీని వీడతారని సమాచారం ఉన్నా జగన్ లైట్ తీసుకోమంటున్నారంట.. మరి ఆయన ధీమా ఏంటో?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×