E-Paper
Advertisement

CM Jagan in London: లండన్‌లో సీఎం జగన్, కాకపోతే..

CM Jagan in London: లండన్‌లో  సీఎం జగన్, కాకపోతే..
Advertisement

CM Jagan in London: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ శనివారం మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు. ఆయనకు అక్కడ వైసీపీ అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యామిలీతో లండన్‌కు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో కొంతమంది ఆయనను రిసీవ్ చేసుకున్నారు.

అక్కడి నుంచి నేరుగా స్టే చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. మధ్యలో వైసీసీ అభిమానులు సీఎం జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. కాకపోతే వాహనం వేగంగా వెళ్లిపోయింది. ఫారెన్ టూర్‌లో భాగంగా సీఎం జగన్ ఫ్యామిలీ సభ్యులు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే యూరప్‌లో వైసీపీ విభాగంలో సమావేశం కానున్నారు. తిరిగి ఈనెల 31న తిరిగి విజయవాడకు చేరుకున్నారు.

Advertisement

2019 ఎన్నికల తర్వాత కూడా సీఎం జగన్ లండన్ టూర్ వెళ్లారు. అదే సెంటిమెంట్‌ని ఇప్పుడు ఫాలో అయ్యారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నమాట. ఈసారీ గెలుపు మాదేనంటూ సీఎం జగన్ బయటకు చెబుతున్నా, లోపల మాత్రం ఆ ఫీల్ లేదన్నది మరోవైపు వినిపిస్తోంది. అధినేత యాక్టివ్ లేకుంటే.. కౌంటింగ్ రోజు ఏజెంట్ల ఉండరని భావించి ఈ విధంగా స్కెచ్ వేసినట్టు అంటున్నారు.

ఇదిలావుండగా జగన్ వ్యవహారశైలిపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో తాము దగ్గరుండీ అంతా చేస్తే, ఐ‌ప్యాక్ టీమ్‌తో సమావేశమయ్యారని అంటున్నారు. తాము కష్టపడి పని చేస్తే, క్రెడిట్ అంతా వాళ్లకి వచ్చిందంటున్నవాళ్లూ లేకపోలేదు. కనీసం టూర్‌కు వెళ్లేముందు కేడర్‌కు వీడియో మెసేజ్ ఇచ్చినా బాగుండేదని అంటున్నారు.

Advertisement

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×