E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

CM Jagan Mohan Reddy : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..
Advertisement
CM Jagan Mohan Reddy News

CM Jagan Mohan Reddy News(AP political news):

కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను అలర్ట్‌ చేయాలని చెప్పారు. విలేజ్ క్లీనిక్స్‌లోని స్టాఫ్‌కు జేఎన్‌-1 వేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జేఎన్‌-1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకుంటున్నారని.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. జేఎన్‌-1 వేరియంట్‌ కు డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అన్ని గ్రామల్లోని సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని.. ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను కూడా సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×