E-Paper
Advertisement

CM Jagan Comments on CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్

CM Jagan Comments on CBN: చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్
Advertisement

CM Jagan Comments on Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం హిందూపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎండను లెక్క చేయకుండా తనపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడికి వచ్చిన జనాన్ని ఉద్దేశిస్తూ ఆయన అన్నారు.

“మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చాం. ఈ ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 30 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అవ్వతాతలకు గతంలో ఎన్నడూ రానివిధంగా ఇంటికే రూ. 3 వేల పెన్షన్ వస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల చేతిలో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. మత్స్యకార భరోసా, వాహన మిత్రా, లా నేస్తం, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షను అమలు చేస్తున్నాం. 58 నెలల్లోనే ఈ విప్లవాత్మక మార్పులు జరిగాయి. మేనిఫెస్టోను భగవత్ గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం” అని జగన్ అన్నారు.

Advertisement

Also Read: జగన్ ఇంటికి వాస్తు దోషం? ఐదేళ్లలో కనిపించలేదా?

’14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా..? మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు’ అని జగన్ అన్నారు. రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

Advertisement

2014లో హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా..? ఏపీని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చంద్రబాబు చేసిండా..? అంటూ ప్రశ్నించాడు. గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చని వారిని మళ్లీ నమ్మొచ్చా అంటూ ఆయన అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×