E-Paper
Advertisement

Amaravati News: సీఎం చంద్రబాబు వార్నింగ్.. మంత్రివర్గంలో మార్పులు తప్పవా?

Amaravati News: సీఎం చంద్రబాబు వార్నింగ్.. మంత్రివర్గంలో మార్పులు తప్పవా?
Advertisement

Amaravati News: చంద్రబాబు క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనుందా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారా? నేతల వైఖరి వల్లే మార్పులు చోటు చేసుకుంటున్నాయా? స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా కొందరు నేతల తీరు మారలేదా? అవుననే సంకేతాలు ఆ పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

నేతలకు సీఎం చంద్రబాబు పదే పదే వార్నింగ్

Advertisement

ఏపీలో మరో 15 ఏళ్లు తాము అధికారంలోకి ఉంటామని పదేపదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అందుకు ప్రజల నుంచి మద్దతు కోరుతున్నారు. బహిరంగ సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగైతే ఏపీ అభివృద్ధి చెందడం సులువుగా అవుతుందని ఇటీవల కేంద్రమంత్రి పెమ్మసాని సైతం వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాటికి దాదాపు రెండేళ్లు కావస్తోంది. రెండేళ్లలో మంత్రులు, నేతల తీరుని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు సీఎం చంద్రబాబు. వారి పర్ఫామెన్స్ గురించి ఎప్పటి కప్పుడు నివేదికలు దిగువస్థాయి నుంచి తెప్పించు కుంటున్నారు. అందుకోసం సెపరేట్‌గా ఓ టీమ్ గ్రౌండ్‌స్థాయిలో పని చేస్తోంది.

Advertisement

మంత్రివర్గంలో మార్పులు తప్పవా?

ఇంకోవైపు పార్టీ వైపు ఎప్పటికప్పుడు నివేదికలు సీఎం చంద్రబాబు టేబుల్‌పైకి చేరుకుంటున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులను పదే పదే అలర్ట్ చేస్తున్నారు.. హెచ్చరిస్తున్నారు కూడా. కానీ కొందరు నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులకు క్లాసులు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.

కొందరు మంత్రుల పని తీరు సరిగా లేదని, కనీసం ఫైళ్లు సైతం కదలడం లేదని హెచ్చరిస్తున్నారు. సర్వే ప్రకారం వారిని మందలించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులకు సంబంధించి నివేదిక వారి మందు పెట్టి ఎప్పటికప్పుడు సున్నితంగా మందలిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మంత్రలు దారిలోకి వచ్చారట. ఇంకొందరు అస్సలు లెక్క చేయడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: మెడికల్ కాలేజీల కోసం వైసీపీ ప్రజాయుద్ధం

సాధారణంగా చంద్రబాబు రాజకీయాలు వెరైటీగా ఉంటాయని కొందరు నేతల మాట.  ఏ విషయంలోనైనా అధినేత వేగంగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు. యాక్షన్ తీసుకున్నా, చర్యలు చేపట్టా లన్నా, ప్రత్యేక పద్దతులను అనుసరిస్తారని చెబుతున్నారు.

తొలుత ఫీలర్స్ బయటకు వస్తాయని, దాని గురించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని అంటున్నారు. చివరకు నిర్ణయం తీసుకున్నా.. ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని అంటున్నారు. రేపో మాపో జరగనున్న మంత్రివర్గంలో మార్పుల విషయంలో చంద్రబాబు ఈ ఫార్ములా అనుసరించనున్నట్లు సమాచారం.

కేబినెట్‌లో మార్పుల తర్వాత నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ లేకపోలేదు. తరచూ మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంపై వెనుక ఇదే కారణమని అంటున్నారు. కొందరికి ఉద్వాసన తప్పదని, మరికొందరికి శాఖలు మార్చే అవకాశమున్నట్లు సమాచారం.

ఇక ఎమ్మెల్యేల గురించి ప్రతీ నెల నివేదికలు తెప్పించుకుంటున్నారట అధినేత. ప్రజలతో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నారా? లేదా? అనేది తెలుసుకున్నారట. మంచి పెర్ఫామ్మెన్స్ కనబరిచిన వారిని కేబినెట్‌లో తీసుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి మరో ఆరునెలల్లో మార్పులు తప్పవంటూ ఆ పార్టీ నుంచి ఫీలర్స్ వస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×