E-Paper
Advertisement

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, వరుస పరిణామాలు, ఆ బాధ్యతలు అప్పగింత!

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, వరుస పరిణామాలు, ఆ బాధ్యతలు అప్పగింత!
Advertisement

CM Chandrababu: ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సోమ-మంగళవారం హస్తినలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దల నుంచి సీఎం చంద్రబాబుకు పిలుపు రావడంతో హస్తినకు బయలుదేరారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ వెళ్లాలని ఏపీ ముఖ్యమంత్రి భావించారు.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు-సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అక్కడికి చేరుకున్నారు. ఈ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులను ఎన్డీయే సర్కార్ ప్రవేశపెడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

Advertisement

మోదీ-షాతో సీఎం చంద్రాబాబు కీలక సమావేశం- ఈ బిల్లులను ఆమోదింప జేసుకోవాలని భావిస్తోంది కేంద్రం. అవసరమైన మెజార్టీపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే బాధ్యతను సీఎం చంద్రబాబుకు అప్పగించినట్లు ఢిల్లీ సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం పెద్దలు ఆయనను ఢిల్లీకి ఆహ్వానించినట్టు సమాచారం. మరోవైపు ఆగస్టు ఒకటిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఎయిర్‌పోర్టు పాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎడ్యుసిటీలను ఆయనతో ప్రారంభాలని భావిస్తున్నారు.

రాత్రికి సీఎం అక్కడే మకాం-ఎయిర్‌‌పోర్టు నుంచి నేరుగా పార్లమెంటు భవనానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. తొలుత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత అమిత్‌షాను కలవనున్నారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీఆర్‌ పాటిల్‌‌తోపాటు మరి కొందరిని ముఖ్యమంత్రి కలవనున్నారు. రాత్రికి ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఉండనున్నారు.

Advertisement

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం! ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి..

గురువారం ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు. విభజన హామీలు నెరవేర్చడానికీ, పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం పొందడానికి ఈ టూర్ కీలకం కానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రోజంతా వరుసగా రాజకీయ సమావేశాల్లో బిజీ కానున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×