E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్తున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎంవో కార్యాలయం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య చేరుకుంటారు.

అయోధ్యకు సీఎం చంద్రబాబు

Advertisement

అక్కడి నుంచి నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే గడపనున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో ఉండనున్నారు. శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

దర్శనం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్య నుంచి నేరుగా విజయవాడకు చేరుకుంటారు.  అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం తీసుకోనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

రాముడి సన్నిధిలో మూడు గంటలపాటు

ఇదిలావుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ విదేశీ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 30న ఆయన బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాల మాట.  తిరిగి జనవరి నాలుగున విజయవాడకు చేరుకుంటారు. వ్యక్తిగత పర్యటన కోసం సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సివుంది.

ALSO READ:  ఆగిన గుండె.. శవరాజకీయాలకు తెరలేసిన వైసీపీ

ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. సీఎం నేతృత్వంలోని కమిటీ.. చీఫ్ కమిషనర్, నలుగురు కమిషన్ల ఎంపిక పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్‌గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు పేరు ఖరారు అయ్యింది. నలుగురు కమిషనర్ల నియామకాలను ఓకే చేసింది.

మాజీ జర్నలిస్టు వీఎస్‌కే చక్రవర్తిని కమిషనర్‌గా ఖరారు చేసింది ప్రభుత్వం. ఆయనతోపాటు మరో ముగ్గురు కమిషనర్లుగా ఉన్నారు. ఆ ముగ్గురు న్యాయవాదులను ఎంపిక చేసింది. కడపకు చెందిన రవియాదవ్‌, అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న, విశాఖకు చెందిన పీఎస్‌ నాయుడుల పేర్లు ఓకే అయ్యాయి. ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ జీఏడీ వద్ద ఉంది. జీఏడీ నుంచి గవర్నర్‌కు ఫైలు వెళ్లిన తర్వాత ఆమోదముద్ర పడనుంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×