// // Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు -->
E-Paper
Advertisement

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు

Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు
Advertisement

Puttaparthi: భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ సత్యసాయి బాబా అని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రేమ, సేవ, ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావంతో ఆయన జీవించారన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఇవాళ ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు.

ప్రేమ-సేవ- ప్రశాంతతకు ప్రతిరూపం సత్యసాయి బాబా

Advertisement

సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమన్నారు ముఖ్యమంత్రి. బుధవారం పుట్టపర్తిలో ప్రశాంతి సత్యసాయి నిలయంలో ఆయన శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, మానవసేవే మాధవసేవ అని నమ్మారని, దాన్ని బోధించారు.. ఆచరించారు.. చివరకు ఫలితం చూపించారన్నారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉందని, నాస్తికులను సైతం ఆధ్యాత్మికం వైపు నడిపించాని వివరించారు. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో ప్రజలను ప్రభావితం చేశారన్నారు.

Advertisement

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు

కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారన్నారు. బాబా చూస్తూ భజనలు చేస్తూ సామాన్యుల భక్తుల నుంచి దేశాధి నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలు గా ఇచ్చారన్నారు. ఆస్తులను వదిలి సత్యసాయి సన్నిధిలో ఎంతో మంది సంతోషంగా గడిపారన్నారు.

భక్తులను ప్రేమగా బంగారు అని సత్యసాయి పిలిచేవారని గుర్తు చేశారు. తాగు నీటి విషయంలో ఆయన చేసిన సేవ మరువలేదన్నారు. విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందించారన్నారు. 102 విద్యాలయాలు 60 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలియజేశారు. రెండు సూపర్ స్పెషాలిటీ, రెండు జనరల్ ఆసుపత్రులను, రెండు మొబైల్ ఆసుపత్రులు ప్రతీ రోజూ 3 వేల మంది సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా వైద్యం అందుతుందన్నారు.

ALSO READ: పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలు తనకు స్ఫూర్తి- మంత్రి లోకేష్

ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని అన్నారు. రాయలసీమకు తాగు నీరు, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని చెప్పారు. 1972లో ఏర్పాటు అయిన సత్యసాయి ట్రస్ట్‌.. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సేవలందిస్తోందన్నారు. ఏ ట్రస్ట్‌కు లేని విధంగా 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.

 

https://twitter.com/bigtvtelugu/status/1991043968667431035

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×