E-Paper
Advertisement

CM Chandrababu In Assembly: సీఎం రేవంత్ ప్రతిపాదన.. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు రియాక్ట్

CM Chandrababu In Assembly: సీఎం రేవంత్ ప్రతిపాదన.. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు రియాక్ట్
Advertisement

CM Chandrababu In Assembly: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాజెక్టులపై మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కానున్నారా? ఈసారి నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి ఏపీ ప్రస్తావించనుందా? అటు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనుందా? అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

సీఎం రేవంత్ ప్రతిపాదన ఏపీ గ్రీన్ సిగ్నల్

Advertisement

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రాజెక్టులపై ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం సరైంది కాదన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలుంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలిగొండకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిపై కేంద్రం వద్ద ప్రస్తావించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని దానికి తాము సపోర్టు చేశామన్నారు.

Advertisement

అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు రియాక్ట్

పోయిన ఏడాది 5 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయాయన్నారు. కృష్ణా నది నుంచి 1500 నుంచి 1600 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదువేల టీఎంసీలు పోయాయని, అందులో 200 టీఎంసీలు నీళ్లు తీసుకుని కరువు ప్రాంతాలకు పంపిస్తే గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. నీటి సమస్య ఉండదన్నారు. ఆ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఇది కరెక్టు కాదన్నారు.

తెలుగు జాతి బాగుండాలన్నారు. సీఎం మాట్లాడిన మాటలు విన్నామని, మాకు ఒకటి రెండు సమస్యలు పరిష్కారం చేస్తే తాము సహరిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదని, రెండు రాష్ట్రాల సమస్యలుంటే కూర్చొని మాట్లాడటానికి మా ప్రభుత్వానికి ఏ మాత్రం అభ్యంతరం లేదన్నారు. నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడడం సరికాదని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ALSO READ:  వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు కుప్పిగంతులంటూ

గురువారం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా ఏపీతో ఉన్న జలవివాదాలను పరిష్కరించుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదన్నారు. కృష్ణా-గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారం.. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఏపీ ఎన్ వోసీ ఇస్తే చాలన్నారు. వరద జలాలు వాడుకోవడానికి తాము అంగీకరిస్తామన్నారు.

గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నట్లు ఏపీ చెబుతోందన్నారు. గోదావరి ట్రైబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 960 టీఎంసీలు వాడుకునేందుకు అభ్యంతరం లేదని ఎన్ వోవీ ఇవ్వాలన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా సమస్యలపై చర్చించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×