E-Paper
Advertisement

CM Chandrababu: మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం.. సీఎం చంద్రబాబు సీరియస్
Advertisement

CM Chandrababu: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంగరాయ వైద్యకళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఆ శాఖ అధికారులు నివేదిక అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసలేం జరిగింది?

మెడికల్ కాలేజీలు రేపో మాపో ఓపెన్ కానున్న నేపథ్యంలో విద్యార్థులపై వేధింపులు ఘటన కలకలం రేపుతున్నాయి. తాజాగా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థునులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపాయి. దాదాపు 50 మంది పారా మెడికల్ విద్యార్థినులపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మరో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తించారు.

Advertisement

ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు తీవ్రమయయాయి. సెల్‌ఫోన్‌ల్లో వారి ఫోటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు బాధిత విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. తాము శాశ్వత ఉద్యోగులమని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు ఒకడు విద్యార్థినులను బెదిరించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో పైస్థాయి అధికారులకు ఫిర్యాదులు వెల్లాయి.  దానిపై విచారణ చేపట్టారు. ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని విచారణ కమిటీకి బాధిత విద్యార్థులు తెలిపారు. అయితే, తాము ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని, విద్యార్థుల ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు ఉద్యోగులు. వేధింపుల వ్యవహారం నిజమేనని తేలింది.

Advertisement

ALSO READ: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈసారి వారికే ఛాన్స్

చక్రవర్తితోపాటు మరో ముగ్గురు విద్యార్థినులను వేధించినట్లు అధికారుల విచారణలో బయటపడింది. విద్యార్థునులపై వేధింపు వ్యవహారం తెలియగానే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైద్య శాఖ అధికారులు నివేదిక అందించారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.

ఆరోపణలు నిజమని తేలడంపై వారిపై కఠిన చర్యలు సిద్ధమయ్యారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో విద్యా సంస్థల్లో మహిళల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. దేశంలో వివిధ విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×