E-Paper
Advertisement

CM Chandrababu: మూడు ముక్కలాట గేమ్ ఎండ్.. వైసీపీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: మూడు ముక్కలాట గేమ్ ఎండ్.. వైసీపీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. మూడు ముక్కలాట గేమ్‌కు ఎండ్ కార్టు పడిందన్నారు. బుధవారాన్ని చారిత్రాత్మక రోజుగా వర్ణించారు. రాజధానిని ఇంచ్ కూడా ఎవరూ కదిలించలేరని తేల్చేశారు.

ఏపీలో మూడు ముక్కలాట గేమ్ ఎండ్-సీఎం చంద్రబాబు

Advertisement

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జగన్ లాంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదన్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. వైసీపీది మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందన్నారు.

ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. ఇకపై అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదలించలేరన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా విధ్వంసం అయ్యిందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాలేదన్నారు. దాన్ని రాజకీయ పార్టీగా ఎలా ఊహిస్తారో తనకు అర్థం కాలేదన్నారు.

Advertisement

ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీపై సీఎం ఘాటు వ్యాఖ్యలు

ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి నేతలు సిగ్గుపడాలన్నారు. ఈ పార్టీ వల్ల రాష్ట్రానికి ఏమీ రాదన్నారు. ఇవాళ పార్లమెంటులో ఏపీ రాజధానిపై కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. రాజధానిని విధ్వంసం చేసి ఏడారి అని ఒకరు, శ్మశానం అని మరొకరు రకరకాలుగా మాటలు చెప్పారని గుర్తు చేశారు. చివరకు మనకు రాజధాని లేకుండా చేశారన్నారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయగిరికి రెండు ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం ఈ ప్రాంతానికి రెండు కంపెనీలు వచ్చినట్టు వివరించారు. ఒకప్పుడు ఉదయగిరిలో వ్యవసాయం చేయలేక వలస పోయేవారని వివరించారు.

ALSO READ: పార్టీనే సుప్రీం.. గీత దాటితే అంతే సంగతులు!

ఇటుక పేరు చెబితే ఉదయగిరి ప్రజలు గుర్తుకు వచ్చేవారని అన్నారు. ఉదయగిరి ప్రజల వద్ద డబ్బులు లేవని, ఇక్కడి నుంచి బయటకు వెళ్లినవారి దగ్గర డబ్బులే డబ్బులన్నారు. వెళ్లినవారు తిరిగి ఉదయగిరికి రావాలన్నారు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×