E-Paper
Advertisement

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష
Advertisement

AP News: ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  దీని ప్రభావం హోర్మూజ్ జలసంధిపై  పడనుంది. దీంతో రానున్న రోజుల్లో చమురు కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. పరిస్థితి గమనించిన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.  చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతబడుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వం చెవిలో పడింది.  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారులతో సమీక్ష నిర్వహించారు.  సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చమురు కష్టాలు రావచ్చని వినియోగదారులు భావిస్తున్నారు. ఆయిల్ లేకుంటే తమకు పనులు జరగవని చాలామంది వినియోగదారులు భావిస్తున్నారు. ప్రజలు ఆందోళనకు గురిరావడంతో పెట్రోల్ బంకుల్లో రద్దీ తీవ్రమైంది.

క్కసారిగా డిమాండ్ 50 శాతానికి పెరిగింది. పెట్రోల్, డీజిల్ సరైన సమయానికి రాకపోవడంతో మూతబడుతున్నాయి. శ్రీకాకుళం మొదలు చిత్తూరు జిల్లా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఆయా బంకుల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీ వ్యాప్తంగా 4,510పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందులో 10 శాతం బంకులు సరఫరా లేక మూతపడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగింది.

ప్యానిక్ వల్ల కొనుగోళ్లు చేయడంతో అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని వివరించారు. సాధారణ రోజుల్లో 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9048 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. కొరత రాబోతుందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని తెలిపారు. శనివారం 10,345 లీటర్ల పెట్రోల్, 14,156 లీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు వివరించారు.

ALSO READ: సీఎం చంద్రబాబు సీరియస్.. మారని నేతల అనుచరులు, కేసు నమోదు చేయాలని ఆదేశం 

సాధారణ అమ్మకాల కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని తెలియజేశారు. వినియోగదారులు అనేక పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్‌లలో ఆయిల్ కొనుగోళ్లు జరుపుతారని, వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందన్నారు.

దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు-ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలన్నారు సీఎం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×