E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతులు.. చంద్రబాబు- రేవంత్-పవన్‌లకు చోటు, జగన్-కేసీఆర్ మాటేంటి?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతులు.. చంద్రబాబు- రేవంత్-పవన్‌లకు చోటు,  జగన్-కేసీఆర్ మాటేంటి?
Advertisement

IE 100-2026: దేశంలో అత్యంత శక్తి వంతుల జాబితాను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ జాబితాను ఆ సంస్థ విడుదల చేస్తూ వస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల స్థానమెంత? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.

IE 100-2026 జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతులు

Advertisement

మరో విడత దేశంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. అయినప్పటికీ రాజకీయ పార్టీల సమీకరణాలు పెద్దగా మారలేదు. బీజేపీ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ ఆ పార్టీని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని ఆ జాబితా స్పష్టంగా తెలియజేసింది. టాప్-20లో చోటు దక్కించుకున్న ఎన్డీఏయేతర నాయకులు రాహుల్‌గాంధీ తొమ్మిదో స్థానం దక్కించుకోగా, మరొకరు మమతా బెనర్జీ.. కాంగ్రెస్ కంటే కాస్త ముందున్నారు.

ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో చాకచక్యంగా వ్యవహరించిన పీయూష్ గోయల్ ఐదో ప్లేస్ లో నిలిచారు. ఆర్థిక మంత్రి నిర్మిల సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ టాప్-10లో నిలిచారు. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలో అత్యంత శక్తివంతమైన తెలుగు నాయకుడిగా నిలిచారు. ఆయన 13వ స్థానం దక్కించుకున్నారు. రాహుల్ గాంధీ తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన ఆ పార్టీ నాయకుడిగా అవతరించారు రేవంత్‌రెడ్డి.

Advertisement

చంద్రబాబు- రేవంత్-పవన్‌లకు చోటు.. జగన్-కేసీఆర్ మాటేంటి?

ఆయన 25వ స్థానంలో నిలిచారు. నటులుగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించడమే కాకుండా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినీ రంగం.. ఈ రెండింటిలో అగ్రస్థానానికి ఎదుగుతున్నారు. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 68వ స్థానంలో నిలిచారు. ఆయన తన రాజకీయ పలుకుబడి జాతీయస్థాయిలో నిరూపించుకున్నారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా తన ర్యాంకును 35వ స్థానానికి మెరుగుపరుచుకున్నారు. 55వ స్థానంలో ఎంఐఏం నేత అసదుద్దీన్ ఓవైసీ కాగా, ఈసారి బీహార్ సీఎం నితీష్ కుమార్ ర్యాంక్ పడిపోయింది. గతంలో ఆయన 63 వస్థానంలో ఉండగా, ఇప్పుడు 84వ ప్లేస్‌కు పరిమితమయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రివర్గంలో యువనేతల ప్రభావాన్ని ఆ జాబితాలో చూపించింది.

ALSO READ: డేంజర్ బెల్స్.. నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. బయట అడుగుపెడితే వడదెబ్బే!

గమనించదగ్గ విషయం ఏమిటంటే, టాప్ 100లో బీఆర్ఎస్ లేదా వైఎస్సార్‌సీపీ నుండి ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కలేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు ప్రయార్టీ ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు తాము కూడా టాప్-50లో ఉన్న నేతలేనని వారి మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×