E-Paper
Advertisement

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో సీఎం బాబు

CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
Advertisement

CM chandrababu: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నింపిన శక్తి అందిలోనూ ఉంటుందని తెలిపారు.

సరిగ్గా వందేళ్ల క్రితం ఈ పుణ్యభూమిపై ఒక గొప్ప లక్ష్యం కోసం సత్యసాయిబాబా అవతరించారని కొనియాడారు. చిన్నతనం నుంచే ఎంతో కోట్ల మందిని ప్రభావితం చేశారని తెలిపారు. మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపమే సత్యసాయి బాబా అని చెప్పారు. విశ్వశాంతి, విశ్వ, సౌభాగ్యం, సకలజనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisement

అందుకే భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని సీఎం అన్నారు. ప్రమేతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి బాబా చాటిచెప్పారని తెలిపారు. సత్యసాయి పుట్టిన ఏపీలో తానూ పుట్టడం పూర్వజన్మ సుకృతమని చంద్రబాబు అభివర్ణించారు. సత్యసాయి విద్య, వైద్య, ప్రజావరసరాలని తీరుస్తూ.. సేవాభావమే దైవత్వమని నిరూపించారని అన్నారు. సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు పయనిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్

Advertisement

ఇదిలా ఉంటే.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంప్ సైట్‌లో ఉదయం 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు మంత్రి నారా లోకేష్.. ఆయా సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×