E-Paper
Advertisement

Amaravati: ఆనాడు అనుకున్నా.. సాధించా, మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్- సీఎం చంద్రబాబు

Amaravati: ఆనాడు అనుకున్నా.. సాధించా,  మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్- సీఎం చంద్రబాబు
Advertisement

Amaravati: దేశ మనుగడ ఉన్నంతవరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారన్నారు సీఎం చంద్రబాబు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతీ పౌరుడికి చెప్పాలన్నారు. కొన్ని దేశాల్లో బలహీన వర్గాలకు ఓటుహక్కు కల్పించలేదన్నారు. అమెరికాలో ఎప్పుడూ మహిళలు ప్రెసిడెంట్ కాలేదన్నారు. ఛాయ్ వాలా దేశానికి ప్రధాని కావడం రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశమన్నారు.

ఆనాడు అనుకున్నా.. సాధించా-సీఎం చంద్రబాబు

Advertisement

గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి అయ్యారని వివరించారు. రాజ్యాంగం మనకు హక్కులు, విధులను కల్పించిందన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు చాలా బాగా మాట్లాడారని అన్నారు. ఎక్కడా తడబడకుండా పిల్లలు మాట్లాడడం బాగుందన్నారు.

విజన్ ఉంటే సరిపోదని, దాన్ని అమలు చేయడం ముఖ్యమన్నారు. నిరంతరం శ్రమ పడితేనే అనుకున్నది సాధించగలమన్నారు. 28 ఏళ్లకు తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు సీఎం చంద్రబాబు. చదువుకునేటప్పుడు తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదన్నారు. మా సార్ తనకు లెక్చరర్ గా అవకాశం ఇచ్చారని, ఎమ్మెల్యే కావాలని కోరికతో ఆ పోస్టుని తిరస్కరించానన్నారు.

Advertisement

మాక్ అసెంబ్లీలో విద్యార్థుల స్పీచ్ అదుర్స్

ప్రజా ప్రతినిధి అయితే ఐఏఎస్ లను కూడా ఆదేశించనవచ్చని ఆరోజు అనుకున్నానని వివరించారు. 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానని, 45 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ రెవల్యూషనరీ థింకింగ్ చేస్తారని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్లాలన్నారు. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని తెలియజేశారు.

ఓటు హక్కు కల్పించని చోట, పోరాటాలు చేసి ఓటు హక్కు సాధించారని గుర్తు చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారత్ అని అన్నారు. ప్రాథమిక హక్కులతో పాటు బాధ్యతలు కూడా రాజ్యాంగం ఇచ్చిందన్నారు. చాలామంది హక్కులపై మాట్లాడుతారని, బాధ్యతలపై మాట్లాడరని తెలియజేశారు.

ALSO READ: అధ్యక్షా అంటూ సీఎం చంద్రబాబు ముందు అదరగొట్టిన చిన్నారులు

గతంలో తనను ఇబ్బంది పెట్టినప్పుడు రాజ్యాంగం పుస్తకం పట్టుకుని నడిచానని అన్నారు మంత్రి లోకేష్. రాజ్యాంగ పుస్తకం చదివితే అదంటే ఏంటో మాకు తెలియదని పోలీసులు అన్నారని తెలిపారు. అప్పుడే నిర్ణయించుకున్నా ప్రతి పిల్లోడి దగ్గర ఈ బుక్ ఉండాలి అని, రాజ్యాంగ హక్కులు వారికి తెలియజేయాలన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×