E-Paper
Advertisement

AI Impact Summit: సాంకేతిక హబ్‌గా తీర్చడమే లక్ష్యం.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు

AI Impact Summit: సాంకేతిక హబ్‌గా తీర్చడమే లక్ష్యం.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
Advertisement

AI Impact Summit-2026: సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. గూగుల్ లాంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఏఐ డేటా హబ్‌గా మారుతుందన్నారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించిన పరికరాలను తయారు చేసేలా క్వాంటం ఎకో సిస్టం రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు

Advertisement

ఢిల్లీ వేదికగా భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై జరుగుతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి పాల్గొని ప్రసంగించారు.

దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని, దేశం దానిని సాధించి తీరుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని, పౌరులందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ ఏఐ‌ని వినియోగించేందుకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

సాంకేతిక హబ్‌గా తీర్చడమే లక్ష్యం.. పలు కంపెనీలతో ఒప్పందాలు

డీపీ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా ఏపీ దృష్టి సారిస్తోందన్న సీఎం, ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. ఈ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు క్వాంటం ఎకోసిస్టంను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

ఆ తర్వాత ఐబీఎం ఇండియా ఎండి సందీప్ పటేల్, ఐబీఎం రీసెర్చ్ ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమిత్ సింఘీతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అంతకుముందు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్ సమీర్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం UNICC-ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం జరిగింది.

ALSO READ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అమరావతి క్వాంటం వ్యాలీలో AI, క్వాంటం కోసం ఎక్సలెన్స్ సెంటర్‌ ఏర్పాటు కానుంది. UN గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా సార్వభౌమ, సైబర్ సెక్యూర్ AI విస్తరణలను అనుమతిస్తుందన్నారు.  ఈ సహకారం అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, ప్రపంచ భాగస్వామ్యాలను తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్‌ను విశ్వసనీయ AI, క్వాంటం ప్రపంచ పటంలో ఉంచుతుందన్నారు. UNICC డైరెక్టర్ శ్రీ సమీర్ చౌహాన్, UNICC AI హబ్ చీఫ్ శ్రీమతి అనుషా దండపాణితో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. మొత్తం వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది ప్రభుత్వం.

ఏపీలో లక్ష మంది యువతకు AI, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్యం కల్పించడానికి IBMతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన, రాబోయే 3 నుండి ఐదేళ్లలో పరిశ్రమకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దుతామన్నారు.భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలను వారంతా పొందుతారని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక శ్రామిక శక్తిని బలోపేతం చేస్తామన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×